Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రాలు ఏర్పాటు చేయండి..
- హైకోర్టు ఆదేశాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో ఎక్కడెక్కడ జంతు సంతాన నియంత్రణ కేంద్రాలు లేవో ఆయా ప్రాంతాల్లో మూడు నెలల్లోగా వాటిని ఏర్పాటు చేయాలంటూ హైకోర్టు... రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో వందలాది వీధి కుక్కలను చంపేస్తున్నారంటూ జంతు సంరక్షణ కార్యకర్త శ్రీరమ్య, ఇతరులు విడివిడిగా దాఖలు చేసిన రిట్ పిటీషన్లను చీఫ్ జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలితో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం విచారించింది. వీధి కుక్కలను తీసుకెళ్లి వాటికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయాలనీ, అందుకు భిన్నంగా పలు మున్సిపాల్టీల్లో వాటిని దారుణంగా చంపేస్తున్నారని పిల్లో పేర్కొన్నారు. జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం, జంతు జనన నియంత్రణ (కుక్కలు) నిబంధనలను అమలు చేయడం లేదనే విషయాన్ని పిటిషన్‌దారులు హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఈ అంశంపై కోర్టు స్పందిస్తూ... జంతు జనన నియంత్రణ నిబంధనలను అధికారులు ఖచ్చితంగా అమలు చేయాలనీ, అలాంటి కేంద్రాలు లేని చోట్ల మూడు నెలల్లో వాటిని ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ తుది ఉత్తర్వులు జారీ చేసింది.