Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షులు తిరుమలై రామన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
యువతను మోసం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'అగ్నిపథ్' పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షులు తిరుమలై రామన్ ప్రకటించారు. నాలుగేండ్లకే సైనికుల రిటైర్మెంట్ అంటే ఆ తర్వాత అదానీ, అంబానీ కార్పొరేట్ సంస్థల్లో సెక్యూరిటీగార ు్డలుగా పనిచేసే నియామకాలు జరుగుతున్నాయా? అని ప్రశ్నించారు. అగ్నిపథ్ పథకాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్ చౌరస్తాలో ఏఐవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా తిరుమలై రామన్ మాట్లాడుతూ ''అగ్నిపథ్'' కారణంగా దేశంలో జరుగుతున్న ఆందోనళలకు, ఆర్మీ అభ్యర్థుల మరణాలకు మోడీ, రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా బాధ్యత వహించాలన్నారు. అగ్నిపథ్ వల్ల సైన్యం గోప్యత, విశ్వసనీయతకు భంగం కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ పథకాన్ని నిలిపివేసి, మునుపటిలా ఆర్మీ నియామక ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి సుక్జేందర్ మహేసరి మాట్లాడుతూ గతంలో రైతులను లక్ష్యంగా చేసుకొని నల్ల వ్యవసాయ చట్టాలను తీసుకవచ్చి అనేకమంది రైతులను బలి తీసుకున్నారని, యువతను లక్ష్యంగా చేసుకొని ''అగ్నిపథ్'' తీసుకొచ్చి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నేడు యువతను బలి తీసుకుంటుందని విమర్శించారు. మిలిటరీ ఉద్యోగాలపై ఆశలు పెట్టుకున్న నిరుద్యోగ యువతకు మోడీ ప్రభుత్వం ద్రోహం చేసిందని విమర్శించారు. ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వలి ఉల్లాV్‌ా ఖాద్రి మాట్లాడుతూ ఆర్మీ ఉద్యోగ అభ్యర్థుల పోరాటానికి మద్దతు తెలుపుతున్నామనీ, తాము ప్రత్యక్షంగా పాల్గొంటామని తెలిపారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి నిర్లేకంటి శ్రీకాంత్, హరీష్, మహమూద్, మజీద్ ఖాన్, హర్షద్, శ్రీమాన్ పాల్గొన్నారు.