Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశ భద్రతపై మోడీ సర్కారు రాజీపడింది
- ఆ పథకం లోపభూయిష్టమైంది
- కేంద్రంపై ఎంపీ ఉత్తమ్ ఆగ్రహం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ సర్కారు 'అగ్నిపథ్' అనే లోపభూయిష్ట పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా దేశభద్రతపై రాజీపడిందని కాంగ్రెస్ ఎంపీ ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. సాయుధ దళాల్లో ఆ పథకం ఓ ఉపాధి హామీ పథకం(ఎన్ఆర్ఈజీఎస్) లాంటిందని ఎద్దేవా చేశారు.శుక్రవారం జూమ్ మీటింగ్ ద్వారా ఆయన విలేకర్లతో మాట్లాడారు.అగ్నిపథ్ ఓ అనాలోచితమైన నిర్ణయమని ఎద్దేవా చేశారు. ఈ పథకాన్ని ఎన్‌ఆర్‌ఈజీఎస్‌తో పోల్చవచ్చననీ, ఇందులో బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు సాయుధ దళాలలో కేవలం నాలుగేండ్ల సేవకు హామీ ఇవ్వడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. ఆ బలగాల్లో కాంట్రాక్టు ఉద్యోగాలే తప్ప అగ్నిపథం కాదనీ, ఈ చర్య దేశ భద్రతపై రాజీ పడడమేనని చెప్పారు. బీజేపీ నేతలు ఇతర దేశాలను ప్రస్తావిస్తున్నారనీ, ఆయా దేశాల్లో పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయనీ, వాటిని మనదేశంతో పోల్చలేమని తెలిపారు.ఈ పథకం ద్వారా నియమితులైన సైనికులు నాలుగేండ్ల తర్వాత తమ భవిష్య త్తుపై తీవ్ర అనిశ్చితితో సేవలందించాల్సి వస్తుందని హెచ్చరించారు.
సికింద్రాబాద్ ఘటనకు నిరసనగా బీజేపీ సర్కారు దిష్టిబొమ్మ దహనం
సికింద్రాబాద్ ఘటనకు నిరసిస్తూ కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్ ముందు బీజేపీ సర్కారు దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్ మాట్లాడుతూ సికింద్రాబాద్ ఘటన పోలీసు కాల్పుల్లో మరణించిన రాకేష్‌ది ప్రభుత్వ హత్యేనని అని విమర్శించారు. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఉజ్మాషాకీర్, కేకేసీ చైర్మెన్ లక్ష్మణ్ యాదవ్ పాల్గొన్నారు.
విద్యార్థిని చనిపోవడం బాధాకరం : రేవంత్ ట్వీట్
సికింద్రాబాద్ ఘటనలో రాకేష్ అనే విద్యార్థి చనిపోవడం దారుణమని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు కలిసి చేసిన హత్యేననీ, దీనికి ఆ రెండు ప్రభుత్వాలు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.