Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియో
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'అగ్నిపథ్'పై సికింద్రాబాద్‌లో చేపట్టిన ధర్నా సందర్భంగా రైల్వే పోలీసు కాల్పుల్లో వరంగల్ జిల్లాకు చెందిన రాకేశ్ మరణిచటం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతినీ, సంతాపాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు ఆయన బలైపోయారని ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. రాకేశ్ కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియోతోపాటు అర్హులైన వారికి అర్హత మేరకు ఉద్యోగమిస్తామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాలకు రాకేశ్ బలయ్యారని విచారం వ్యక్త చేశారు. తమ ప్రభుత్వం తెలంగాణ బిడ్డలను కడుపులో పెట్టుకుని చూసుకుంటుందని తెలిపారు.