Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నియామక విధానాన్ని అర్థాంతరంగా ఎందుకు మార్చినట్టు?: నారాయణ
నవ తెలంగాణ:అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళన కేవలం కేంద్ర ప్రభుత్వ సృష్టేనని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ విమర్శించారు. నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటం ఆడిన ఫలితమే ఈ హింసాకాండ అని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సైనికుల నియా మక విధానాన్ని అర్థాంతరంగా ఎందుకు మార్చినట్టు? అని ప్రశ్నించారు. 15 నెలల్లోనే పది లక్షల ఉద్యోగాలిస్తామన్న ప్రధాని మోడీ ప్రకటనలోనే దగా ఉందని పేర్కొన్నారు. లక్షల ఉద్యో గాలిచ్చినట్టే ఇచ్చి నాలుగేండ్లలో మాయచేసే దుర్మార్గపు ఆలోచనల నేపథ్యంలోనే యువత తిరగబడిం దనీ, సికింద్రాబాద్లో హింసాకాండ చోటుచేసుకుందని వివరించారు. మృతులకు సంతాపం, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించి, పాత పద్ధతిలోనే నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆందోళనకు దిగిన యువతపై కాల్పుల ఘటనకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకున్న మూర్ఖపు నిర్ణయమే కారణమని సీపీఐ రాష్ట్ర ఇంఛార్జీ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి విమర్శించారు. పోలీసులు కాల్పులు జరపడాన్ని ఖండించారు. మృతిని కుటుంసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనీ, క్షతగాత్రులకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు.
సికింద్రాబాద్లో కాల్పులకు ప్రజాపంథా ఖండన
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆందోళన చేపట్టిన యువతపై పోలీసులు కాల్పులు జరపడాన్ని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా ఖండించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు ఒక ప్రకటన విడుదల చేశారు. అగ్నిపథ్ పథకం నిరుద్యోగులకు శాపంగా మారిం దని విమర్శించారు. యువత ఆశలు అడియాశలయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాల్పుల ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ పథకాన్ని రద్దు చేసి నిరుద్యోగులకు రక్షణ కల్పించాలని కోరారు.