Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14 సెక్షన్ల కింద కేసులు
- సాధారణ స్థితికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సాధా రణ స్థితికి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 'అగ్నిపథ్' స్కీంకు నిరసన గా శుక్రవారం ఉద్యోగా ర్ధులు ఈ స్టేష న్లో విధ్వంసం సృష్టిం చిన విషయం తెలిసిందే. కేవలం రెండు, మూడు రైళ్లు మినహా మిగిలిన అన్ని రైళ్లను శని వారం నుంచి యథావిధిగా నడుపుతు న్నట్టు దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబా ద్ డివిజనల్ మేనేజర్ అభరుకుమార్ గుప్తా తెలిపారు. యువకుల విధ్వంస ంలో దాదాపు రూ.12 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. నాలుగు కోచ్ లు పూర్తిగా కాలిపోయాయనీ, పలు రైళ్ల అద్దాలు ధ్వంసమయ్యాయని వివ రించారు. ప్లాట్ఫాం నెంబర్ 2,3,4ల్లో ప్రయాణీకుల సౌకర్యాల కల్పనకు కొంత సమయం పడుతుందన్నారు. ప లు చోట్ల సీసీ కెమెరాలూ ధ్వంసం చే శారని చెప్పారు. జరిగిన ఘటన, ఆస్తి నష్టంతో కేంద్రప్రభుత్వా నికి నివేదిక పంపిస్తామని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ఘటనపై గోపాల పురం పోలీసులు, రైల్వే పోలీసులు వేర్వేరుగా కేసులు న మోదు చేశారు. ఇప్పటి వరకు 52 మ ందిని అరెస్టు చేసినట్టు రైల్వే ఎస్పీ అనూరాధ తెలిపారు. రైల్వే ఉద్యోగి రాజానర్సు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశా మన్నారు. గోపాల పురం పోలీసుల అదుపులో మరి కొం తమంది ఆందోళనకారులున్నారు. నిం దితులపై ఐపీసీ సెక్షన్ 143, 147, 324, 307, 435, 427, 448, 336, 332, 341, రెడ్ విత్ 149 తో పాటు ఇండియన్ రైల్వే యాక్ట్150, 151, 152 కింద 14 సెక్షన్లతో కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.