Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జులై మొదటివారంలో మహాధర్నా
- యూఎస్పీసీ హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వేసవి సెలవులు పూర్తయినా, ఈనెల మూడో వారం గడిచినా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల పై నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేయడం తగదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ)రాష్ట్ర స్టీరింగ్ కమిటీ విమర్శించింది. తక్షణమే షెడ్యూల్ విడుదల చేయాలని డిమాండ్ చేసిం ది. ఈనెలాఖరులోగా బదిలీలు, పదో న్నతుల షెడ్యూల్ ప్రకటించకుంటే జులై మొదటి వారంలో మహాధర్నా చేపడతామని హెచ్చరించింది. సమ స్యలు పరిష్కారమయ్యే వరకు పోరా టం కొనసాగుతుందని స్పష్టం చేసిం ది. డీటీఎఫ్ అధ్యక్షుడు ఎం రఘు శంకర్ రెడ్డి అధ్యక్షతన శనివారం వర్చువల్ పద్ధతిన యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహిం చారు. యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు కె జంగయ్య, చావ రవి, వై అశోక్ కుమార్, ఎం రవీందర్, టి లింగారెడ్డి, షౌకత్ అలీ,యు పోచయ్య ,డి సైదులు, జాడి రాజన్న, కొమ్ము రమేష్, ఎన్ యాదగిరి, ఎస్ హరికృష్ణ, ఎ గంగాధర్, మసూద్ అహ్మద్, బి కొ ండయ్య, ఎస్ మహేష్, చింతా రమేష్, వై విజయకుమార్ ఒక ప్రకటన విడు దల చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులు అ మలు తర్వాత పదోన్నతులకు ఆటం కాలు తొలగిపోయాయని తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చి 10న అసెంబ్లీలో స్పష్టంగా ప్రకటన చేశారని పేర్కొన్నారు. వేసవిలో బదిలీలు, పదోన్నతులు చేపడతా మంటూ విద్యామంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు. కానీ నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైనా దీనిపై నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేయటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏడేండ్లుగా పదోన్నతుల్లేక, నాలుగేండ్లుగా బదిలీలు, రెండేండ్లుగా విద్యా వాలంటీర్ల నియామకాల్లేక పాఠశాలల్లో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఉన్నత పాఠశాలలో సగటున మూడు సబ్జెక్టు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలుండటంతో విద్యా బోధన కుం టుపడుతున్నదని తెలిపారు.
తక్షణమే బదిలీలు, పదోన్నతులు చేపట్టి అనం తరం ఏర్పడిన ఖాళీలను ప్రత్యక్ష నియామకం ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈలోగా పాఠశాలల అవసరం మేరకు తాత్కాలిక ఉపా ధ్యాయుల (విద్యా వాలంటీర్లు)ను నియమించాలని కోరారు. ఏ ఆటంకా లు లేవంటూనే కేజీబీవీ, మోడల్ స్కూ ల్ ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూల్ ప్రకటన చేయటంలో జాప్యం ఎందు కని ప్రశ్నించారు.
డీఎస్ఈ వ్యవహారశైలి మార్చుకోవాలి
సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, ఏక రూప దుస్తులు సరఫరా చేయాలని యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. 317 జీవో అమలు అనంతరం ఉపాధ్యాయులకు ఏర్పడిన సమస్యలపై (పరస్పర బదిలీలు, భార్యాభర్తల బదిలీలు తదితర) అప్పీళ్ల ను వెంటనే పరిష్కరించాలని కోరారు. వేతనాలను ప్రతినెలా మొదటి తేదీన విడుదల చేయాలని సూచించారు. సప్లిమెంటరీ బిల్లులను వరుస క్రమంలో జాప్యం లేకుండా మంజూరు చేయాలని తెలిపారు. ఉపాధ్యాయులు, సంఘాల నేతల పట్ల పాఠశాల విద్యా శాఖ సంచాలకులు (డీఎస్ఈ) వ్యవ హార శైలి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. కార్యాలయంలో సందర్శన వేళలు ప్రకటించాలనీ, సమస్యలపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాల ని కోరారు. కార్యాలయంలో రెండేండ్లు గా పేరుకు పోయిన సమస్యలు పరిష్క రించాలని డిమాండ్ చేశారు.