Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కొప్పుల ఈశ్వర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మన రాష్ట్రంలోని గురుకులాలు అద్భుత ఫలితాలు సాధిస్తున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.శనివారం హైదరాబాద్లోని క్యాంపు కార్యా లయంలో ఎస్సీ,ఎస్టీ,బీసీ,జనరల్ గురుకుల విద్యా సంస్థల సొసైటీలకు చెందిన పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశాలకు సంబంధించిన ఫలితాలను మంత్రి విడుదల చేశారు. అనంతరం అధికారులతో గురుకులాల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాల వారి కి నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఉచిత విద్యనందించాలనే దఢ సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు. అందులో భాగంగానే పెద్ద సంఖ్యలో గురు కులాలను నెలకొల్పాలని చెప్పారు. మన గురుకులాలకు పేరు ప్రతిష్టలు ఉన్నా యనీ, వీటికి మరింత వన్నె తెచ్చేందుకు బాలబాలికల తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేందుకు అందరూ అంకితభావంతో ముందుకు సాగాలని కోరారు.