Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమిస్తున్న బాసర త్రిపుల్ఐటీ విద్యార్థులకు విజ్ఞానదర్శిని వ్యవస్థాపక అధ్యక్షులు టి రమేష్ సంఘీభావంతోపాటు మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం సిగ్గుపడాలని విమర్శించారు. తక్షణమే సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు.