Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు హైదరాబాద్‌లో పర్యటన
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ఆసియాన్-ఇండియా మీడియా ఎక్స్చెంజీ కార్యక్రమంలో భాగంగా పది దేశాలకు చెందిన 20 మంది జర్నలిస్టుల బృందం రాష్ట్రానికి వచ్చింది. శనివారం శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర సమాచార అధికారులు యాసా వెంకటేశ్వర్లు, సి రాజారెడ్డి వారికి స్వాగతం పలికారు. వారంతా ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. మూడు రోజులపాటు విదేశీ జర్నలిస్టుల పర్యటన కొనసాగుతుందని అధికారులు చెప్పారు. ఆసియాన్ మీడియా బృందంలో బ్రూనై దారుసలాం, కాంబోడియా, ఇండోనేసియా, లావోస్ రిపబ్లిక్, మలేసియా, మయన్మార్, పిలిప్పీన్స్, సింగపూర్, వియత్నాం, థాయిల్యాండ్ దేశాలకు చెందిన మీడియా ప్రతినిధులు ఉన్నారు. ఆసియాన్ జర్నలిస్టుల బృందం తమ పర్యటనలో భాగంగా ఆదివారం ఉదయం ఆదిభట్లలోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, మధ్యాహ్నాం శామీర్పటలో భారత్ బయోటెక్‌ను, సాయంత్రం గచ్చిబౌలిలోని టీహబ్‌ను సందర్శిస్తుందని తెలిపారు.