Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆప్ నేత ఇందిరాశోభన్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బాసర ఐఐఐటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని ఆమ్ ఆద్మీ పార్టీ చైర్పర్సన్ ఇందిరాశోభన్ విమర్శించారు. శనివారం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఆమె విలేకర్లతో మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు వారం రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నప్పటికీ వాటిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం లేదన్నారు.