Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షులు తిరుమలై రామన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ద్రోహం చేయడం వల్లే నిరుద్యోగ యువత రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నదని ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షులు తిరుమలై రామన్ విమర్శించారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి సమావేశాలు శనివారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వలీఉల్లాV్‌ా ఖాద్రి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమలై రామన్ మాట్లాడుతూ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామనీ, నిరుద్యోగభృతి రూ.తొమ్మిది వేలు ఇస్తామని ఇచ్చిన హామీలను మోడీ సర్కారు విస్మరించిందని విమర్శించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్ బాలమల్లేష్, ఏఐవైఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి సుక్జేందర్మహేసరి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్దినేని కరుణ, సభ్యులు నిర్లేకంటి శ్రీకాంత్, వెంకటేశ్వర్లు, శంకర్, యుగందర్, సత్యప్రసాద్, ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు.