Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రాజేశ్వర్రావుపై రాష్ట్ర ప్రభుత్వం వేటువేసింది. ఈమేరకు ఆర్జీయూకేటీ ఇన్‌ఛార్జి వీసీ రాహుల్ బొజ్జ ఆదేశాలు జారీ చేశారు. రాజేశ్వర్‌రావును విధులను తొలగిస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపారు. ఈ బాధ్యతలను ఆర్జీయూకేటీ డైరెక్టర్‌గా నియమితులైన సతీశ్‌కుమార్‌కు అప్పగించాలని ఆదేశించారు.