Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేపు ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసన
- ఏఐకేఎంఎస్ అధ్యక్షులు వేములపల్లి వెంకట్రామయ్య పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఏఐకేఎంఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆశిష్మిట్టల్పై ఉత్తరప్రదేశ్లో యోగి ప్రభుత్వం 120 బితోపాటు పలు సెక్షన్ల కింద నమోదు చేసిన తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలని ఏఐకేఎంఎస్ జాతీయ అధ్యక్షులు వేములపల్లి వెంకట్రామయ్య డిమా ండ్ చేశారు. కేంద్రంలో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు అను సరిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా సోమవారం దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసన ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్లోని మార్క్స్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యూపీలో యోగి ఆదిత్యనాథ్ బుల్డొజర్ రాజ్యాన్ని నడుపుతున్నారని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సహించడం లేదన్నారు. ఉపా, దేశద్రోహం కేసులు నమోదు చేస్తున్నారని చెప్పారు. ఏఐకేఎంఎస్ జాతీయ ఉపాధ్యక్షులు జెవి చలపతిరావు, రాష్ట్ర అధ్యక్షులు వి కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను దిగజార్చాయని అన్నారు. ముస్లిం దేశాలు ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయన్నారు. కేంద్రంలో బీజేపీ అరాచక పాలనను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు.