Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాల్పులు జరిపింది రాష్ట్ర పోలీసులే :బండి సంజరు
నవతెలంగాణ - కరీంనగర్
ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయం నుంచే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసానికి పక్కా పథకం ప్రకారం జరిగినదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజరు కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అగ్నిపథ్ గొప్ప పథకమని.. ఆర్మీ అభ్యర్థులు వాస్తవాలు తెలుసుకోవాలని అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన శక్తి కేంద్ర ఇన్చార్జీల సమావేశం నిర్వహించారు. పోలింగ్ బూత్ కమిటీల ఏర్పాటు, వచ్చేనెల 3న హైదరాబాద్‌లో జరగబోయే బహిరంగ సభకు జన సమీకరణ వంటి అంశాలపై చర్చించారు. అనంతరం బండి సంజరు మాట్లాడారు. హైదరాబాద్‌లో మా తడాఖా చూపిస్తామని ముందే కాంగ్రెసోళ్లు హెచ్చరించి 'చలో రాజ్ భవన్' పేరుతో విధ్వంసం సృష్టించారన్నారు. బీజేపీని డ్యామేజ్ చేసి కాంగ్రెస్ గ్రాఫ్ పెంచాలనే సీఎం కేసీఆర్ నీచమైన కుట్రకు తెరతీశారని ఆరోపించారు. అగ్నిపథ్ లాంటి పథకాలు చాలా దేశాల్లో అమలు చేస్తున్నారన్నారు. ఈ పథకంపై ఏమైనా అనుమానాలు, అపోహలుంటే నివృత్తి చేసుకోవాలే తప్ప విధ్వంసాలకు పాల్పడమేంటని ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్‌కు తెలియకపోవడమేమిటని, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే కుట్ర జరిగిందని ఆరోపించారు. రాష్ట్ర పోలీసులు కాల్పులు జరపడంవల్లే వరంగల్ జిల్లా యువకుడు చనిపోయాడన్నారు. రాకేష్ అంతిమ యాత్ర పేరుతో టీఆర్ఎస్ నేతలు కేంద్ర సంస్థలపై దాడులు చేసి విధ్వంసం చేయటం సిగ్గు చేటన్నారు. ఇదంతా ప్రీ ప్లాన్‌గా సీఎంఓ నుంచి జరుగుతున్న కుట్రేనని, బీహార్, ఉత్తరప్రదేశ్‌లో కూడా కేసీఆర్ లాంటోళ్లే దాడులు చేస్తున్నారని అన్నారు. వీరందరికీ ఓ స్ట్రాటజిస్ట్ ఉన్నాడన్నారు.