Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘట్కేసర్ పోలీస్ స్టేషన్‌కు తరలింపు
- స్టేషన్ వద్ద కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన
నవతెలంగాణ-ఘట్కేసర్
సికింద్రాబాద్ ఘటనలో మృతిచెందిన రాకేష్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు శనివారం వరంగల్ వెళ్లేందుకు బయలుదేరిన టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతిఘటించడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. చివరకు పోలీసులు రేవంత్‌రెడ్డిని ఘట్కేసర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాకేష్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటారు? ఎక్కడికెళ్తే అక్కడికొచ్చి అడ్డుకోవడం ఏమిటి? అని ప్రశ్నించారు.రాకేష్ చావును వాడుకుని టీఆర్ఎస్ శవరాజకీయాలు చేస్తోందని విమర్శించారు. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనవచ్చుగానీ..మేము పాల్గొనకూడదా అని నిలదీశా రు. కాగా రేవంత్‌రెడ్డిని విడుదల చేయాలని మాజీ మంత్రి కొండా సురేఖ సహా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘట్కేసర్ పీఎస్ తరలి వచ్చారు. పీఎస్ గేటును తోసుకుని లోపలికి వెళ్లారు. రేవంత్‌రెడ్డిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.