Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలంగాణ రిజిస్ట్రేషన్, స్టాంప్స్ యునైటెడ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ చైర్మెన్‌గా డాక్టర్ ఎస్.ఎమ్. హుస్సేని (ముజీబ్) ఎన్నికయ్యారు. అసోసియేషన్ చీఫ్ అడ్వైజర్ సామల సహదేవ్, ప్రెసిడెంట్ స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి సిరాజ్ అన్వర్ ఆధ్వర్యంలో కన్వీనర్‌గా సేవలందిస్తున్న సేవారత్న సమక్షంలో శనివారం ఈ ఎన్నిక జరిగింది. కన్వీనర్‌గా హెచ్.రవి, కోశాధికారిగా నరేష్ గౌడ్, అసోసియేట్ అధ్యక్షులుగా ప్రణరు కుమార్, కె.భూపాల్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా అరవింద్, జాయింట్ సెక్రటరీ-1 తస్లీమ్ మొహమ్మద్, జాయింట్ సెక్రటరీ-2గా హేమలత, ఈసీ మెంబర్‌గా ఎం.పద్మ నియమితులయ్యారు. కార్యక్రమంలో నాయకులు ముత్తన్న, ఉద్యోగులు ఎం.ఏ.ముజీబ్, కుర్రాడి శ్రీనివాస్ పాల్గొన్నారు.
తెలంగాణ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ యూనిటెడ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ చైర్మెన్‌గా ఎన్నిక అయిన సందర్భంగా ముజీబ్‌కు టీఎన్జీవో యూనియన్ ఉద్యోగులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిజిస్ట్రే షన్ ఉద్యోగులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయ కుండా ఎల్లప్పుడూ అండగా ఉంటానన్నారు. ఉద్యోగుల సమస్యలన్నీ అతి త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఐజీ రాహుల్ బొజ్జా, సెంట్రల్ యూనియన్ అధ్యక్షులు మామిళ్ల రాజేందర్, గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులు మమత, సెంట్రల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్, టీజీవో సంఘ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులకు, ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు.