Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫుడ్ ప్రాసెసింగ్, గోల్డ్ మైనింగ్ల్లో
పెట్టుబడులకు అవకాశం
- ఇండియా-ఘనా సమ్మిత్తో హై
కమిషనర్ అసోమా క్యూకా
- ఎపీ, తెలంగాణ నుంచి పాల్గొన్న
డాక్టర్ కేవీ రెడ్డి, జీవి కృష్ణ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఇండియా, ఘనా దేశాల మధ్య అగ్రికల్చర్, ఫార్మా, ఐటీ వ్యాపార సంబంధాలను మరింత విస్తరిస్తామని ఘనా హైకమిషనర్ అసోమా చేరిమే క్వాకూ అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని హెచ్ఐసీసీిలో ఇండియా ఆఫ్రికా ట్రేడ్ కౌన్సిల్ (ఐఏటీసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన 'ఇండియా ఘనా సమ్మిట్'లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా గవర్నమెంట్ అడ్వైజర్ అజరుమిశ్రా, రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ బాలయ్యతో కలిసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూపొందించిన 'ఎంఎస్ఎంఈ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ సెంటర్'ను ఆయన ప్రారంభించారు. అనంతరం అసోమా మాట్లాడుతూ ఫార్మా, కలప, బంగారం, ఐటీ రంగాల్లో పెట్టుబడులకు విస్తృత వ్యాపార అవకాశాలున్నాయని తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఘనాలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. అగ్రికల్చర్, ఆయిల్స్, గోల్డ్ మైనింగ్, రెనెవబుల్ ఎనర్జీ, ఫార్మా, మెడిసిన్, ఐటీ డెవలప్మెంట్, ఇండిస్టీయల్ డెవలప్మెంట్ తదితర వ్యాపార వాణిజ్యాలకు భారీగా అవకాశాలున్నాయని వివరించారు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండిస్టీ, కాఫీ ఉత్పత్తులను ఇక్కడ దిగుమతులకు అనుకూలంగా ఉన్నట్టు చెప్పారు. రెండు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య రంగాల్లో అభివద్ధికి తెలుగు రాష్ట్రాలు వేదిక కాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఘనా మినిస్టర్ కౌన్సిలర్ ఎర్నెస్ట్ నానా అడ్జే మాట్లాడుతూ గత 2021-22లో ఇండియా 736.56 మిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసిందని తెలిపారు. అదే విధంగా 1069.51మిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను ఘనా దిగుమతి చేసుకుందని చెప్పారు. ఇండియా-ఆఫ్రికా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐఏఐఐటీ), ఫుడ్ ప్రాసెసింగ్ ఇంక్యూబేషన్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసిందని తెలిపారు. ఈ సందర్భంగా ఘనా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల క్యూబా ట్రేడ్ కమిషనర్లుగా డాక్టర్. కేవీరెడ్డి, జీవీ కష్ణకు నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.