Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యావాలంటీర్లను వెంటనే నియమించాలి
- టీపీటీఎఫ్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల షెడ్యూల్‌ను వెంటనే ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని టీపీటీఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. విద్యార్థుల సంఖ్యకనుగుణంగా విద్యావాలంటీర్లను నియమిం చాలని కోరింది. టీపీటీఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశం ఆదివారం హైదరా బాద్‌లో నిర్వహించారు. అనంతరం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై అశోక్‌కుమార్, ప్రధాన కార్యదర్శి ముత్యాల రవీందర్ ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించ డంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. గత ఏడేండ్లుగా ఉపాధ్యాయులకు పదోన్నతుల్లేవనీ, నాలుగేండ్లుగా సాధారణ బదిలీలు నిర్వహించలేదని తెలిపారు. పాఠశాలల్లో వేలాదిగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. విద్యారంగంలో పర్యవేక్షణ పోస్టులు మండల విద్యాధికారులు, జిల్లా ఉప విద్యాధికా రుల పోస్టులు 90 శాతంపైగా ఖాళీలున్నాయని విమర్శిం చారు. దీనివల్ల పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు రోజురోజుకు పడిపోతూ ప్రభుత్వ పాఠశాలల మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే టీచర్ల పదోన్నతులు, బదిలీల షెడ్యూల్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలంటే ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణమే ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా విద్యావాలంటీర్ల నియామకాన్ని చేపట్టాలని కోరారు. పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు తెచ్చిన 'మన ఊరు మన బడి' పథకం ప్రచారార్భాటాలకు పరిమితమైంది తప్ప పాఠశాలలను బాగు చేయడంలో, కనీస సౌకర్యాలు కల్పించడంలో చిత్త శుద్ది ప్రదర్శించడం లేదని విమర్శించారు.