Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బక్క జడ్సన్ డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సమాచార హక్కు చట్టం కింద సమాచారమిచ్చే ముందు సంబంధిత ముఖ్యకార్యదర్శి అనుమతి తీసుకోవాలంటూ సీఎస్ సోమేష్కుమార్ జారీ చేసిన ఉత్తర్వుల నేపథ్యంలో ఆయనపై డిపార్టు మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ) ఆగ్రహం వ్యక్తం చేసిం దని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్కజడ్సన్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ జీవో నెంబర్ 3674/జీపీఎం అండ్ ఏఆర్/2021 (13.10.2021) సమాచార హక్కు చట్టానికి విరుద్ధ మనీ, సీఎస్ ఆదేశాలను వెంటనే వెనక్కి తీసుకునేలా చర్యలు తీసుకో వాలని కోరారు. జాతీయ సమాచార హక్కు చట్టం చీఫ్ కమీషనర్ వై.కె.సిన్హాకు తాను ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో పరిపాలన విధానంలో ప్రజల హక్కులను, చట్టాలను అమలు చేయకపోవడంతో సీఎస్ ఆధ్వర్యంలో మోసాలు, కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించా రు. ఇది ప్రజాస్వామ్యమా? లేదా నియంతపాలనా? అని ప్రశ్నించారు. సీఎం కన్నుసన్నల్లో సీఎస్ రహస్య ఫైళ్లను ప్రభుత్వానికి తయారు చేసి, ప్రజలు అడుగే సమాచారానికి వేరే ఫైళ్లను తయారు ఇస్తూ... సమాచార హక్కు చట్టానికి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. సమాచార హక్కు చట్టం పూర్తి స్థాయిలో అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలనీ, సోమేశ్ కుమార్ను ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.