Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్ఎంఓపీఎస్ సెక్రెటరీ జనరల్ స్థితప్రజ్ఞ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాంట్రిబ్యూటరీ పింఛన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేయాలని కోరుతూ నవంబరులో కర్నాటక రాజధాని బెంగళూరులో ఐదు రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పింఛన్ స్కీం (ఎన్ఎంఓపీఎస్) సెక్రెటరీ జనరల్ స్థితప్రజ్ఞ ప్రకటించారు. బెంగళూరులోని గాంధీభవన్లో ఎన్ఎంఓపీఎస్ ఆధ్వర్యంలో సీపీఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. కర్నాటక నేత శాంతారాం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ నుంచి సీపీఎస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కల్వల శ్రీకాంత్, ఏపీ నుంచి రామాంజనేయులు, కేరళ నుంచి లాజర్, చత్తీస్ఘడ్ నుంచి రాకేష్ సింగ్ తదితరులు హాజరయ్యారు. డాక్టర్ ప్రసన్న కుమార్ రాసిన 'నిచ్చిత పింఛన్- నమ్మ హక్కు' పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా స్థితప్రజ్ఞ మాట్లాడుతూ రాష్ట్రాలు ఆర్థికంగా బలపడాలంటే సీపీఎస్ విధానాన్ని తక్షణమే రద్దుచేసి ఉద్యోగులకు పాత పింఛన్ పథకాన్ని అమలు చేయాలని చేయాలని డిమాండ్ చేశారు. నిరంతర ద్రవ్య లభ్యత కోసం ప్రభుత్వాలు ఈ పింఛన్ విధానాన్ని ఉద్యోగులపై బలవంతంగా రుద్దాయని చెప్పారు. ఈనెల 26న జార్ఖండ్ రాజధాని రాంచీలో ఎన్ఎంఓపీఎస్ ఆధ్యర్యంలో భారీ బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఈ సభకు స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వచ్చి పాత పింఛన్ ప్రకటన చేస్తారని అన్నారు.అదే విధంగా నవంబర్లో బెంగళూరులో తెలంగా ణ, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కేరళ సీపీయస్ ఉద్యోగ, ఉపాధ్యాయులతో కలిసి భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు.