Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 22 అంశాలతో కరపత్రం
- గ్రామాల్లో అజ్ఞాత వ్యక్తుల ప్రచారం
- అవినీతికి పాల్పడిన వ్యక్తిపై
- విచారణ చేయాలని కరపత్రంలో డిమాండ్
- టీఆర్ఎస్ హయాంలోనే
ఆలయం అభివృద్ధి
- కరపత్రాల్లో వెల్లడించిన విషయాలు అసత్యం : టీఆర్ఎస్ నాయకులు
నవ తెలంగాణ-కొమురవెల్లి
కొమురవెల్లి మల్లన్న ఆలయ తాజా మాజీ చైౖర్మెన్పై విమర్శల వెల్లువ కొనసాగుతూనే ఉంది. ఆయన పదవిలో ఉన్నప్పుడు భారీ అవినీతికి పాల్పడ్డాడని, గతంలో సీపీఐ(ఎం) ఆరోపించిన విషయం విదితమే. మాజీ చైర్మెన్ అవినీతికి పాల్పడ్డాడని 22 అంశాలతో కూడిన కరపత్రాలను ఆదివారం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గ్రామాల్లో పడేసి వెళ్లడంతో చర్చనీయాంశంగా మారింది. కొత్త పూజారుల నియామకంలో, ఒగ్గు పూజారుల అక్రమ నియామకాల్లో లక్షల రూపాయలు వసూలు చేసినట్టు ఈ కరపత్రంలో పేర్కొన్నారు. కరపత్రంలో గీస భిక్షపతిపై ఆరోపించిన విషయాలు.. 'కొత్త పూజార్ల నియామకాల్లో 5 పోస్టులకు ఒకరి వద్ద రూ.10 లక్షల తీసుకున్నారు. ఒగ్గు పూజారుల నియామకాల్లో మూడు పోస్టులకు ఒక్కొక్కరి నుంచి రూ.నాలుగు లక్షలు వసూలు చేశారు. 8 అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాల్లో ఒకొక్కరి వద్ద రూ.నాలుగు లక్షల ఒప్పందం చేసుకుని రూ.2 లక్షల నగదు తీసుకున్నారు. 150 మంది ఒగ్గు పూజారుల నియామకం చేపట్టేందుకు ఒక్కొక్కరి వద్ద లక్ష రూపాయలు తీసుకున్నాడు. కొబ్బరికాయల టెండర్లలోనూ అవినీతికి పాల్పడ్డాడు. ఒగ్గు పూజారుల నుంచి జాతరలో రూ.20 లక్షలు తీసుకున్నారు.
నాయిబ్రాహ్మణుల దగ్గర రూ.ఐదు లక్షలు, 350 మంది పైచిలుకు చిఞరు వ్యాపారులు తోపుడుబండ్ల వద్ద ఒక్కరి వద్ద రూ.5 వేలు తీసుకున్నాడు. దేవస్థానం స్టోర్‌లో రూ.నాలుగు కోట్ల మేర కొనుగోళ్లలో రూ.25 లక్షల అక్రమాలు జరిగాయి. ప్రసాదాల తయారీకి రూ.1.50 కోట్ల నెయ్యి కొనుగోళ్లలో రూ.50 లక్షలు అక్రమంగా తీసుకున్నాడు. వీఐపీ కండువాలు బట్టల టెండర్, ఒగ్గు పూజారుల బట్టలు, కోర మీసాల టెండర్, ఎలక్ట్రిషన్ శానిటేషన్ పనుల్లో, జాతరలో అదనపు ఖర్చుల పేరుతో మాజీ చైర్మెన్ అక్రమాలకు పాల్పడ్డాడు' అని కరపత్రంలో ముద్రించారు. ఈ అవినీతి అక్రమాలు సమాజానికి తెలియాల్సిన అవసరం ఉందంటూ కరపత్రాన్ని ముద్రించడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
కరపత్రంలో వెల్లడించిన విషయాలు అసత్యం
గుర్తుతెలియని వ్యక్తులు కరపత్రాన్ని గ్రామాల్లో పడేశారని, ఈ కరపత్రాల్లో వెల్లడించిన విషయాలు పూర్తిగా అవాస్తవమని టీఆర్ఎస్ మండల నాయకులు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు సద్ది కృష్ణారెడ్డి తెలిపారు.ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర ్‌ఎస్ హయాంలోనే మల్లన్న ఆలయం అభివృద్ధి చెందిందన్నారు. ఇటీవల చైర్మెన్ పదవి కాలం ముగిసిపోవడంతో సిద్దిపేటకు చెందిన శ్రీనివాస్ చైర్మెన్ పదవి కోసం ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించారు. సమావేశంలో సర్పంచ్‌లు భీమనపల్లి కరుణాకర్, పశ్చిమడ్ల స్వామి గౌడ్, ఎంపీటీసీ సాయి మల్లు, ఆలయ మాజీ డైరెక్టర్లు బొంగు నాగిరెడ్డి, కొమురెల్లి, నాయకులు వంశీధర్‌రెడ్డి, రఘు, నర్సింగ్‌రావు, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.