Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్అండ్బీ ఆధ్వర్యంలో
తొలి వంతెన
- లోడ్ టెస్ట్‌ల నిర్వహణ
తుదిదశకు నిర్మాణం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ తీగల వంతెన నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. మరో రెండు నెలల్లో ఈ బ్రిడ్జీని ప్రారంభించేందుకు ఆర్ అండ్‌బీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే బ్రిడ్జీ రోడ్డు పూర్తయింది. మరోవైపు వంతెనను కనెక్ట్ చేసే అప్రోచ్ రోడ్ల నిర్మాణం పనులు సైతం వేగంగా చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో రోడ్లు, భవనాల శాఖ చేపట్టిన తొలి కేబుల్ బ్రిడ్జీ నిర్మాణం ఇదే కావ డం గమనార్హం. 1000 టన్నుల కెపాసిటీ ఉన్న ఈ కేబుల్ బ్రిడ్జీపై ఎంతటి బరువైన వాహనాలైన వెళ్ళేలా అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించారు. అంతే కాకుండా ప్రత్యేక రోజుల్లో తెలంగాణ సంస్కతి సంప్రదాయాలను డిస్ప్లే చేసేలా డైనమిక్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు ఈ వంతెన నిర్మాణంలోని మరో ప్రత్యేకత. హైదరాబాద్‌లో దుర్గం చెరువు కంటే ముందే నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటికీ వివిధ కారణాల మూలంగా ఆలస్యమవుతూ వస్తున్నది.
2014 తరువాత సీఎం హౌదాలో తొలిసారి కరీంనగర్ వచ్చిన కేసీఆర్ కరీంనగర్‌ను పర్యాటకంగా అభివృద్ధ్ది చేస్తానని హామీ ఇచ్చారు. ఇందుకోసం కేబుల్ బ్రిడ్జీ, మానేర్ రివర్ ఫ్రంట్ నిర్మించాలని తలపెట్టారు. ఈ రెండు ప్రాజెక్టులను ఆర్అండ్బీ అధికారులు వేగంగా పూర్తి చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. అటు హైదరాబాద్, ఇటు వరంగల్ వెళ్ళాల్సిన వాహనాలన్ని కూడా అలుగునూర్ బ్రిడ్జీపై నుండి వెళ్ళాల్సి వస్తుండడంతో నిత్యం తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే వరంగల్‌కు ప్రత్యేక రోడ్డును నిర్మించడమే మంచిదని ప్రభుత్వం భావించింది. ఈ కొత్తగా నిర్మించే రోడ్డు వరంగల్ తో పాటు సౌత్ ఇండియాను కలిపే విధంగా ఉండే వంతెన ను డిజైన్ చేశారు. కరీంనగర్- సదాశివపల్లి మధ్య ఉన్న పాత వరంగల్ రోడ్ పై రూ. 149 కోట్లతో కేబుల్ నిర్మాణా న్ని చేపట్టారు. కరీంనగర్ ఎల్ఎండీ వద్ద కొనసాగుతున్న ఈ నిర్మాణం ప్రస్తుతం తుది దశలో ఉంది. కరీంనగర్ జిల్లాకు తలమానికంగా నిలవనున్న ఈ ప్రాజెక్టు, రానున్న రోజుల్లో ట్రాఫిక్ కష్టాలను తీర్చనుండటం తో పాటు టూరిజం హబ్‌గా కూడా ఈ బ్రిడ్జ్ మారుతుందని అధికారులు భావిస్తున్నారు.
సౌత్ ఇండియాలోనే మొదటిది
ఈ తరహా కేబుల్ బ్రిడ్జీ పశ్చిమ బెంగాల్‌లోని హౌరా, ముంబైలో మాత్రమే ఉండగా సౌత్ ఇండియాలో లేదు. తొలిసారి కరీంనగర్ మానేరు నదిపై చేపడుతుండటం విశేషం. దేశంలో మూడో కేబుల్ బ్రిడ్జీ ఇక్కడ నిర్మాణమవు తున్నది. ఈ కేబుల్ బ్రిడ్జీ పూర్తయితే ప్రస్తుతం కరీంనగర్- వరంగల్ మధ్య ఉన్న 72 కిలోమీటర్ల దూరం 7 కిలోమీటర్లు తగ్గనుంది. ఇప్పటికే కేబుల్ బ్రిడ్జీ పనులు పూర్తికాగా, వంతెన పై వాహనాలు ప్రయాణిస్తున్న సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండడంతో పాటు ఫుట్‌పాత్‌పై ప్రజలు వెళ్ళ డం వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుని ఇటీవల బ్రిడ్జీపై లోడ్ టెస్ట్‌ను చేపట్టారు. వంతెనపై ఇరువైపులా 28 టిప్పర్లను నిలిపి... ఒక్కో టిప్పరులో 30 టన్నుల బరువు ఇసుక ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. మొత్తం 840 టన్నుల ఇసుక బరువుతో పాటు... వంతెన ఇరువైపులా ఫుట్ పాత్లపై 110 టన్నుల ఇసుక సంచులను వేశారు. వంతెన పై మొత్తం 950 టన్నుల బరువును ఉంచి... వం తెన కింద 17 ప్రాంతాల్లో సెన్సార్లను ఉంచి... 24 గంటల పాటు పరీ క్షించే టెస్ట్‌లను చేశారు. ఫుట్‌పాత్‌లపై ఇసుక బస్తాలు పెట్టి మళ్ళీ వంతెన సామర్ధ్యాన్ని అంచనా వేస్తున్నా రు. పరిశీలన మొత్తం పూర్తయ్యాకా ఏమైనా సమస్యలు దృష్టికి వస్తే, తీసుకోవాల్సిన చర్యలపై ముందస్తు ప్రణాళికతో ఉన్నారు.
అప్రోచ్ రోడ్ల నిర్మాణమే పెండింగ్
కేబుల్ బ్రిడ్జీ అప్రోచ్ రోడ్ల నిర్మాణ పనులతో పాటు అనుసంధాన రోడ్ల పనులు మాత్రమే పూర్తిచేయాల్సి ఉంది. ఇందుకోసం రూ. 34 కోట్లతో విశాలమైన రోడ్లను ఆర్ అండ ్బీ నిర్మించనుంది. కరీంనగర్ కమాన్ నుంచి సదాశివ పల్లి కేబుల్ బ్రిడ్జీ వరకు నిర్మాణం, మిగతా 4.7 కిలోమీటర్ల మే ర పనులు జరగాల్సి ఉంది. కమాన్ నుంచి బైపాస్ రోడ్డు వరకు... అలాగే సదాశివపల్లి నుంచి కేబుల్ బ్రిడ్జీ వరకు రో డ్డు పనులు చేపట్టాల్సి ఉంది. ఈ రోడ్ల పనులు పూర్తైతే... వె ంటనే బ్రిడ్జీ వాహనాలు వెళ్ళేందుకు అనుమతించను న్నారు. రూ. 8 కోట్లతో రాత్రి వేళల్లో టూరిస్టులను అలరిం చేలా బ్రిడ్జీ పైకి రంగు రంగుల డిజిటల్ లైటింగ్... ఇతర ఆకర్షణీ య పనులను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలను ప్రభు త్వానికి పంపించారు. వాటికి ఆమోదం రాగానే ఆ పనులను కూడా త్వరితగతిన చేపట్టి పూర్తి చేయనున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు జాతీయ అవార్డు సైతం రావడం గమనార్హం.