Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈటలనే కాదు ఏ నాయకుడైనా అమిత్‌షాను కలవొచ్చు : బండి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తమ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా వచ్చే నెల మూడో తేదీన హైదరాబాద్‌లో 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కుమార్ ప్రకటించారు. ఎన్ఈసీ సమావేశ ఏర్పాట్ల జాతీయ ఇన్చార్జీ అరవింద్ మీనన్‌తో కలిసి ఆయన నోవాటెల్‌ను సోమవారం సందర్శించారు. వారి వెంట మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, రాష్ట్ర నాయకులు బంగారు శ్రుతి, కొల్లి మాధవి, జె.సంగప్ప, గోపి, గడీల శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ..రాష్ట్రంలోని 34వేల పోలింగ్ బూత్ కార్యకర్తలను, కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ది పొందుతున్న ప్రజలను మూడో తేదీన జరిగే భారీ బహిరంగ సభకు తరలిస్తామని చెప్పారు. సమావేశాల నిర్వహణ కోసం 34 కమిటీలు వేశామని తెలిపారు. ప్రతికార్యకర్తనూ భాగస్వామ్యం చేసేందుకుగానూ నిధి సేకరిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా విజయవంతం చేసి చూపెడతామన్నారు.
టీఆర్ఎస్ పాలనలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా.. హత్యలు-అత్యాచారాలు-కబ్జాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ కేంద్ర హౌంమంత్రి అమిత్ షాను కలవడంపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు... ''కేసీఆర్ మాదిరిగా, టీఆర్ఎస్ మాదిరిగా మా పార్టీ ఉండదు. మా పార్టీలో ఏ నాయకుడైనా వెళ్లి జాతీయ నాయకత్వాన్ని కలుసుకునే అవకాశం ఉంది'' అని బదులిచ్చారు.