Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దేశంలో అగ్నిపథ్ మంటలు చల్లారలేదని, వెంటనే దాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కొంత మది ఆర్మీ అధికారులు కూడా అగ్నికి ఆజ్యం పోసేలా మాట్లాడుతున్నారని విమర్శించింది. సోమవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో మాజీ ఎంపీ వి హనుమంతరావు, సీనియర్ ఉపాధ్యక్షులు జి నిరంజన్ విలేకర్లతో మాట్లాడారు. కార్పొరేట్ కంపెనీల చేతిలో ప్రధాన మంత్రి బందీ అయ్యారని విమర్శించారు. వారి ప్రయోజనం కోసం పని చేస్తున్నారని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ వ్యూహంలో భాగంగానే అగ్నిపథ్ రూపకల్పన జరిగిందని ఆరోపించారు.