Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెయ్యి బీడీలకు రూ.18.10 ఇచ్చేందుకు యాజమాన్యాల అంగీకారం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీడీ టేకేదారులకు కమిషన్ పెంచుతూ తెలంగాణ బీడీ మాన్ఫాక్చరింగ్ అసోసియేషన్ నిర్ణయం తీసుకున్నది. వెయ్యి బీడీలకు రూ.18.10 ఇచ్చేందుకు అంగీకారం తెలిసింది. గతంలో రూ.15.05 ఇచ్చేది. మొత్తంగా రూ.3.05 పెంచినట్టయింది. సోమవారం నిజామాబాద్లో టేకేదారులకు సంబంధించిన ట్రేడ్ యూనియన్ల నేతలతో కమిషన్ పెంపుపై ప్రత్యేకంగా చర్చలు జరిపి ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ చర్చల్లో తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.గోపాలస్వామి, బాలమణి, తెలంగాణ టేకేదార్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సిద్ధిరాములు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్ఞానేశ్వర్, వర్కింగ్ ప్రెసిడెంట్ దశరథ్, నాయకులు దాసు, ఐఎఫ్టీయూ నేత వనమాల కృష్ణ, బీఎమ్ఎస్ నేత కె.శ్రీనివాస్, టేకేదార్లకు సంబంధించిన స్వతంత్ర సంఘం నాయకులు బాలరాజు పాల్గొన్నారు.