Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌పై సీఎం కేసీఆర్ రెండు నాలుకల ధోరణిని అవలంభిస్తున్నారని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కె.ఎ.పాల్ విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమా వేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రాన్ని నిలదీసి విద్యార్థులను శాంతింపజేయకుండా కేసీఆర్ శవరాజ కీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఒక్క కుటుంబం కూడా సంతోషంగా లేదని తెలిపారు. ముందు రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చి బంగారు భారత నిర్మాణం కోసం వెళ్లాలని సూచించారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమ స్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమా వేశంలో ఆ పార్టీ అధికార ప్రతినిధులు ఉపేంద్ర యాదవ్, కొత్త దేవదాస్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.