Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వ నివేదిక విడుదల
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో మాంసం ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగింది. ఈమేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం నివేదిక వెల్లడించింది. 2013-14లో 4.46 లక్షల టన్నుల మాంసం ఉత్పత్తి ఉండగా, అది 2021-22 నాటికి 10.15 లక్షలటన్నుల ఉత్పత్తికి పెరిగిందని తెలిపింది. 2013-14 సంవత్సరంలో ప్రతి ఒక వ్యక్తి సగటున 12.95 కేజీ మాంసం వినియోగించగా, 2021-22 లో 22.55 కేజీల వినియోగానికి పెరిగిందని పేర్కొంది. రాష్ట్రంలో మత్స్యసంపద (చేపల పెంపకం) కూడా గణనీయంగా పెరిగిందని వెల్లడించింది. రాష్ట్రంలో పాడి సంపద, మత్స్య, పశుసంపద పెరగడంతో దేశంలో రాష్ట్రం అగ్రరాష్ట్రంగా ఎదిగిందని నివేదిక తెలిపింది.2013 సంవత్సరంలో రూ.24,878 కోట్ల విలువ గల పశు సంపద ఉండగా, 2021-22 నాటికి రూ.94,400 కోట్ల పశు సంపద గణనీయంగా పెరిగింది. 79.45 శాతం అభివృద్ధితో రూ.69,522 కోట్ల సంపదకు గడిచిన ఎనిమిదేండ్లలో పశు సంపద పెరిగింది. రాష్ట్రంలో 2013-14 ఆర్థిక సంవత్సరంలో 2,012 గొర్రెల పెంపకం సొసైటీలు ఉండగా, 2020-21 నాటికి ఆ సొసైటీల సంఖ్య 8,392కు పెరిగింది. పాడి పరిశ్రమ అభివృద్ధిని పరిశీలిస్తే, 2013-14 సంవత్సరంలో 42.07 లక్షల టన్నుల పాల ఉత్పత్తి ఉండగా, 2021-22 నాటికి 60.99 లక్షల టన్నుల ఉత్పత్తికి పాలన సంపద పెరిగింది. 2014-15లో దినసరి పాల వినియోగం 296 గ్రాములుండగా, 2021-22 సంవత్సరంలో 370 గ్రాముల వినియోగానికి పెరిగింది. 25 శాతం వృద్ధితో 74 గ్రాముల వినియోగం పెరిగిందని నివేదిక తెలిపింది.