Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ఇన్చార్జి కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రజలతో మమేకమై వారి సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సీపీఐ రాష్ట్ర మూడో మహాసభలను విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో ప్రజలకు విజ్ఞప్తి చేసారు. హైదరాబాద్లోని మఖ్దూం భవన్లో నిర్వహించిన రంగారెడ్డి జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి మూడేండ్లకోసారి పార్టీ మహాసభలు జరగుతాయని పేర్కొన్నారు. ఆక్రమంలో రాష్ట్ర మూడో మహాసభలు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పట్టణంలో సెప్టెంబర్ నాలుగు నుంచి ఏడు వరకు జరగనున్నట్టు తెలి పారు. ఈ సభలకు 33 జిల్లాల నుంచి 800మంది ప్రతినిధులు హజరు కానున్నట్టు పేర్కొన్నారు. రెడ్ షర్ట్స్ వాలంటీర్ల కవాతు అనంతరం వేలాదిమందితో భారీ బహిరంగ సభ ఉంటుందని అయన వెల్లడించారు. ఈ మహాసభలో పార్టీ భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, జాతీయ కార్యదర్శి అతుల్ కుమార్ అంజాన్, సీపీఐ పార్లమెంటరీ పక్ష నాయకులు బినోరు విశ్వం, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి పాల్గొంటారని పేర్కొన్నారు.