Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పన్ను మదింపు కోసం తప్పుడు సమాచారంపై చర్య
నవతెలంగాణ-దుండిగల్
ఆస్తిపన్ను మదింపులో తప్పుడు వివరాలు సమర్పించి నందుకు హైదరాబాద్లోని బాచుపల్లి ఎస్ఎల్జీ ఆస్పత్రికి నిజాంపేట్ మున్సిపల్ అధికారులు రూ.24 కోట్ల జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేశారు. అందులోని వివరాల ప్రకారం.. ఆస్పత్రి 4 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందుకుగాను 2 సెల్లార్లు, గ్రౌండ్ ఫ్లోర్ సహా 9 అంతస్తులకు పర్మిషన్ ఉంది. అయితే, వాస్తవానికి 10 లక్షల చదరపు గజాల్లో నిర్మాణ అంతస్తులు ఉండగా.. కేవలం నాలుగంతస్తుల్లో 32,300 చదరపు గజాలుగా పేర్కొంటూ ఇటీవల ఆస్పత్రి యాజమాన్యం ఆస్తిపన్ను స్వీయ మదింపునకోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంది. దీనిపై విచారణ చేపట్టిన నిజాంపేట మున్సిపాలిటీ అధికారులు సదరు వివరాలు తప్పుగా ఉన్నట్టు నిర్ధారించారు. తెలంగాణ మున్సిపల్ చట్టం ప్రకారం.. దరఖాస్తుదారుడు స్వీయ ఆస్తిపన్ను మదింపులో ఇచ్చిన వివరాలు తప్పుగా ఉంటే సదరు ఆస్తి విలువకు 25 రెట్ల జరిమానా విధిస్తారు. ఆ ప్రకారం.. ఆస్పత్రికి రూ. 24 కోట్ల జరిమానా విధించినట్టు అధికారులు పేర్కొన్నారు.