Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రపంచానికి భారత దేశం అందించిన గొప్ప సంపద యోగా అని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్ అన్నా రు. సోమవారం కేఎల్ యూనివర్సిటీలో న్యూ మాక్ యోగా అసోసియేషన్ ఆప్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా దినోత్సవంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ ప్రతిఏడాది యోగాడేను ఆనవాయితీగా నిర్వహిస్తున్నారని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత క్రీడల అభివృద్ధికి ప్రాధాన్యత పెరిగిందన్నారు. అందులో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కు సుమారు రూ.7,500 కోట్లను ప్రభుత్వం కేటాయించిందన్నారు.