Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఎస్పీఎస్సీ గ్రూప్ 3, 4, డీయస్సీ, గురుకుల ఉపాధ్యాయుల పరీక్షలకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఆసక్తి ఉన్న ప్రయివేటు స్టడీ సర్కిళ్లు, సంస్థల నుంచి రాష్ట్ర బీసీ స్టడీ సర్కిల్ సీల్డ్ కొటేషన్లు, బిడ్లను ఆహ్వానించింది. ఈ మేరకు సర్కిల్ డైరెక్టర్ కె.అలోక్ కుమార్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మార్గదర్శకాల కోసం స్టడీ సర్కిల్ వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 040-2707 7929 లో సంప్రదించవచ్చు.