Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తిప్పాపురం అడవుల్లో ఘటన
నవతెలంగాణ - చర్ల
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తిప్పా పురం గ్రామ పంచాయతీ గొరుకొండ అటవీ ప్రాం తంలో అటవీశాఖ ఆధ్వ ర్యంలో జరుగుతున్న ట్రెంచ్ పనులకు వినియోగించిన ప్రొక్లైనర్ను మావోయిస్టులు తగలబెట్టారు. మరో జేసీబీని వారి వెంట తీసుకెళ్లారు. సుమారు రూ.25 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని ప్రాథమిక సమాచారం. కొన్నిరోజుల కిందట కిష్టారంపాడు, బత్తినపల్లి గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో అటవీశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ట్రెంచ్ పనులు అడ్డుకుని అక్కడ ఉన్న జేసీబీని దహనం చేసేందుకు మావోయిస్టు యాక్షన్ టీం మెంబర్లు రాందాస్, రాజేష్, బాలు ప్రయత్నించారు. పోలీసులు అప్రమత్తం అవడంతో ఎదురు కాల్పులు జరిపి తప్పించుకున్నారు. అయితే ఆదివారం జరిగిన ఘటనలో మావోయిస్టు యాక్షన్ టీములు పాల్గొన్నాయా లేదా అనేది పోలీసుల విచారణలో తేలనుంది.