Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ -నార్కట్ పల్లి
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే, ఉద్దీపన కార్యక్రమం చైర్మెన్ వేముల వీరేశం కరోనా వారియర్ అంతర్జాతీయ అవార్డు అందుకున్నారు. కరోనా కష్టకాలంలో నకిరేకల్ నియోజకవర్గంలో ప్రజలకు అవగాహనా సదస్సులు పెట్టి.. వారిలో భయాందోళనలు తొలగించారు. కషాయ వితరణ కేంద్రాలు, హోమియో మందులు పంపిణీ చేశారు. కరోనా వైరస్ బారిన పడిన వారికి కరోనా కిట్లను అందజేశారు. కరోనా మృతదేహాలను దహనం చేయడానికి కుటుంబీకులు, బంధువులు కూడా భయపడిన సమయంలో.. ఆయన స్వయంగా శ్మశాన వాటికకు తరలించి అంత్యక్రియలు చేశారు. ఆయన ప్రజాసేవను గుర్తించి విశ్వ గురు వరల్డ్ రికర్డ్ వారు కరోనా వారియర్ అంతర్జాతీయ అవార్డును సోమవారం నార్కట్‌పల్లి మండల కేంద్రంలోని శబరి గార్డెన్స్‌లో అందజేశారు.