Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీ-ఫైబర్)కు బిజినెస్ ఎక్స్‌లెన్స్ అవార్డు లభించింది. నాలెడ్జ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ (కేసీసీఐ) ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మత్స్య, పశుసంవర్థక, పాడి పరిశ్రమల శాఖ మంత్రి పురుషోత్తం రూపాల చేతుల మీదుగా ఈ అవార్డును టీ-ఫైబర్ మేనేజింగ్ డైరెక్టర్ సుజారు కారంపూరి అందుకున్నారు. డిజిటల్ ఇండియాలో భాగంగా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ బదలాయింపు విభాగంలో టీ-ఫైబర్‌ను ఈ అవార్డు కోసం ఎంపిక చేసినట్టు ఆ సంస్థ సెక్రటరీ జనరల్ భారత్ పటేల్ తెలిపారు. కేసీసీఐ ఐదవ వార్షిక సమావేశం సందర్భంగా బిజినెస్ ఎక్స్‌లెన్స్ అవార్డ్సు-2022 నిర్వహించారు. టీ-ఫైబర్ ద్వారా ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌ను గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపచేసినందుకు గుర్తింపుగా ఈ అవార్డును ఇస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. తమ సేవల్ని గుర్తించి నందుకు టీ-ఫైబర్ ఎమ్డీ సుజరు కారంపూరి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతోనే ఈ ఘనత సాధ్యమైందని చెప్పారు.