Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రానికి హైకోర్టు నోటీసులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్‌లోని అనేక ఆస్పత్రులు, వాణిజ్య సముదాయాలు, షాపింగ్ మాల్‌లు, సినిమా థియేటర్లు మొదలైన చోట్ల మెయింటెనెన్స్, సెక్యూరిటీ నిర్వహణ తదితర పేర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేయడంపై వివరాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ అంశంపై ఇద్దరు హైకోర్టు జడ్జీలు రాసిన లేఖను హైకోర్టు పిల్ స్వీకరించింది. హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ప్రభుత్వ జీవోలకు విరుద్ధంగా పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నారనీ, దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులైన మున్సిపల్, పోలీస్, రెవెన్యూ, ఫైర్, లేబర్ శాఖలు, జీహెచ్ఎంసీలకు నోటీసులు ఇచ్చింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తున్నట్టు చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్రశర్మ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ సోమవారం ప్రకటించింది.
దిశ ఎన్‌కౌంటర్‌పై పిల్స్ విచారణ
దిశ లైంగిక నిందితుల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టు విచారణ రెండు వారాలకు వాయిదా పడింది. ఎన్కౌంటర్ పేరుతో నిందితుల్ని హత్య చేశారనీ, దీనిపై విచారణ చేయాలంటూ దాఖలైన పలు పిల్స్‌ను చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్రశర్మ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ సోమవారం విచారణ జరిపింది. సుప్రీంకోర్టు నియమించిన జ్యుడిషియల్ కమిటీ రిపోర్టును అమికస్కక్యూరీకి అందజేయాలని రిజిస్ట్రీకి ఆదేశాలిచ్చింది.