Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
నేటి నుంచి జరగనున్న ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ సెమిస్టర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఓయూ ఎగ్జామినేషన్ విభాగం కంట్రోలర్ ప్రొ.శ్రీనగేశ్ తెలిపారు. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీఎస్‌డబ్ల్యూ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు 2, 4, 6 సెమిస్టర్లతోపాటు అన్ని సెమిస్టర్లకు సంబంధించిన బ్యాక్లాగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. జూన్ 21 నుంచి ఆగస్టు 12 వరకు ఆయా కోర్సుల విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ఓయూ పరిధిలో చదువుతున్న 410 డిగ్రీ కాలేజీల విద్యార్థులకు 350 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సుమారు 4 లక్షల 84 వేల 291 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని వివరించారు. సబ్జెక్టుల వారీగా పరీక్ష తేదీల కోసం యూనివర్సిటీ వెబ్సైట్ www.osmania.ac.inను సంప్రదించాలని ప్రొ. శ్రీనగేశ్ సూచించారు. పరీక్షలు వాయిదా పడతాయంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు. విద్యార్థులు పరీక్షల హాల్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లొద్దని, 15 నిమిషాల ముందే సెంటర్‌కు చేరుకోవాలని సూచించారు.