Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలి :
- ఏఐకేఎమ్ఎస్ జాతీయ అధ్యక్షులు వేములపల్లి వెంకట్రామయ్య డిమాండ్రి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఏఐకేఎంఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆశిష్ మిట్టల్‌పై ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులను వెంటనే ఎత్తేయాలనీ, కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని ఏఐకేఎమ్ఎస్ జాతీయ అధ్యక్షులు వేములపల్లి వెంకట్రామయ్య డిమాండ్ చేశారు. ఇవే డిమాండ్లపై సోమవారం హైదరాబాద్‌లోని అఖిల భారత రైతు కూలీ సంఘం(ఏఐకేఎమ్ఎస్) కార్యాలయం నుంచి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూపీలో ఆశిష్ మిట్టల్ అనేక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించారనీ, సీఏఏ, ఎన్ఆర్సీ, ఢిల్లీ రైతాంగ ఉద్యమాలకు నాయకత్వం వహించడంతోనే యోగి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని విమర్శించారు. దీని ద్వారా బీజేపీ ప్రభుత్వం తాను కార్పొరేట్ పెట్టుబడిదారీ వర్గాలకు ఏజెంట్ అని నిరూపించుకున్నదన్నారు. దేశ రక్షణ రంగంలో కాంట్రాక్ట్ పని విధానాన్ని తీసుకురావడం సరిగాదని తెలిపారు. దీని ద్వారా దేశంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్మీ ఉద్యోగాల్లో రెగ్యులరైజేషన్ తీసేయడంతో అనేక మంది గ్రాట్యుటీ పెన్షన్, ఇతర సదుపాయాలను కోల్పోతారని వివరించారు. మాజీ ఆర్మీ జవాన్ల సమస్యలు తీర్చాలనీ, వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ సఘం జాతీయ ఉపాధ్యక్షులు జేవీ చలపతిరావు, రాష్ట్ర అధ్యక్షులు వక్కవంతుల కోటేశ్వరరావు, పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు ఝాన్సీ, ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు అరుణ, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జూపాక శ్రీనివాస్, పి.మహేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యామ్, రాష్ట్ర నాయకులు సాయికృష్ణ, పీవోడబ్ల్యూ నాయకులు పుష్ప, పవన్, మురళి పాల్గొన్నారు.