Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ తెలంగాణకు ఎందుకొస్తున్నారు?
- అగ్నిపథ్ పేరుతో యువతను మోసం చేస్తున్నారు
- దశల వారీగా అభివృద్ధి పనులు
- కైతలాపూర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-సిటీబ్యూరో/కేపీహెచ్‌బీ
'ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వరంగ భూముల్లో రోడ్లు వేస్తే.. అధికారులపై పోలీసులు కేసులు పెట్టాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్తున్నారు. ఇంజినీర్లు, కార్మికులు, ఉద్యోగుల మీద కాదు.. మీకు దమ్ముంటే పురపాలకశాఖ మంత్రినైన నాపై కేసులు పెట్టండి. ప్రభుత్వంపై పెట్టండి' అని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ కూకట్పల్లి నియోజకవర్గంలో రూ.86 కోట్లతో చేపట్టిన కైతలాపూర్ ఆర్ఓబీని మంగళవారం కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మల్లారెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''మేము నగరంలో ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించాం.. కిషన్‌రెడ్డికి చేతనైతే.. మోడీ దగ్గర పలుకుబడి ఉంటే కంటోన్మెంట్, కరీంనగర్, ఆదిలాబాద్ మార్గాల్లో ఉన్న రక్షణశాఖ భూములను మాకు అప్పగించండి. అద్భుతంగా ప్లై ఓవర్ నిర్మిస్తాం. మంచి పనులు చేస్తే సహకరించండి. అడ్డురాకండి'' అన్నారు.
2022కల్లా ప్రతి పేదోడికీ ఇల్లు కట్టిస్తామని ప్రధాని మోడీ చెప్పారు కానీ ఏ ఒక్కరికీ రాలేదన్నారు. తెలంగాణకు రూ.19 వేల కోట్లు ఇవ్వాలని నీటి ఆయోగ్ చెప్పినా మిషన్ భగీరథకు నయాపైసా ఇవ్వలేదని చెప్పారు. గుజరాత్లో వరదలొస్తే మోడీగారు రూ.1000 కోట్లు ఇచ్చారు.. హైదరాబాద్‌లో వరదలొస్తే నయాపైసా ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి మోడీ, కేంద్ర మంత్రులు వస్తున్నారంట.. ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. రామరాజ్యం తెస్తామని రావణకాష్టం చేశారని విమర్శించారు. అగ్నిపథ్‌తో యువతను ఆగం చేశారని, అందులో చేరిన యువకులను డ్రైవర్లను చేస్తారంట అని ఎద్దేవా చేశారు. పెద్ద నోట్ల రద్దుతో సామాన్యునితో ఆడుకున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో సిలిండర్ ధర రూ.400 అయితే మన్మోహన్సింగ్ను అసమర్థ పీఎం అని, చేతకాని వాళ్లు అన్నారు.. ఈ రోజు సిలిండర్ ధర రూ.1,050కి చేరింది. ఎవరు అసమర్థులు.. ఎవరు చేతగానివాళ్లు అని నిలదీశారు. రాష్ట్రం నుంచి రూ.26 వేల కోట్ల సెస్ చెల్లించామన్నారు. ధరలు ఎందుకు పెంచారని మోడీని అడిగితే హిందూస్థాన్, పాకిస్థాన్ అంటారనిచ మతపిచ్చిలేపి ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారు తప్ప దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి చేతగాదని విమర్శించారు. కులపిచ్చి, మతపిచ్చి పార్టీలు మనకు అవసరం లేదన్నారు. వచ్చేవాళ్లు టూరిస్టులా వస్తారు పోతారు. వాళ్లు ఎందుకు వస్తున్నరో సమాధానం చెప్పాలి? ఏం ప్రాజెక్టులు తెచ్చారని వస్తున్నారని ప్రజలు నిలదీస్తరని చెప్పారు. పచ్చగా ఉన్న రాష్ట్రంలో మతపిచ్చి చిచ్చుపెట్టాలని చూస్తే దీటుగా తిప్పికొట్టాలన్నారు. హైదరాబాద్‌లో నాలాలను అభివృద్ధి చేయడానికి రూ.1000 కోట్లతో ఎస్ఎన్డీపీని ఏర్పాటు చేశామని, చెరువుల సుందరీకరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో కొత్త పింఛన్లు, రేషన్‌కార్డులను త్వరలోనే ఇస్తామన్నారు. గ్రేటర్లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పారదర్శకంగా అర్హులందరికీ అందజేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, శంభీపూర్‌రాజు, నవీన్‌రావు, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, కమిషనర్ డీఎస్.లోకేష్‌కుమార్, కార్పొరేషన్ చైర్మెన్ సాయిచంద్, జగన్ పాల్గొన్నారు.