Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
గ్రామంలో వివిధ అంశాలపై ప్రజలకు సమాచారమిచ్చేందుకు మైక్ సెట్ వినియోగించాలని భావించిన ముగ్గురు వ్యక్తులు వాటిని అమర్చే ందుకు వెళ్లి విద్యుద్ఘాతానికి గురై ప్రాణం కోల్పోయారు. ఈ ఘటన మం గళవారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని అందనా లపాడులోని రామాలయం సమీపంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..రామాలయం సమీపంలో యాప చెట్టుకు మైక్‌సెట్ కట్టేందుకు దుంపల సుబ్బారావు(55), గొర్రె వెంకయ్య(57), మిరియాల మస్తాన్‌రావు(54) వెళ్లారు. చెట్టు ఎక్కి ఓ ఇనుప పైపు అధారంగా మైక్ కడుతుండగా.. పైన ఉన్న 6కేవీ వైర్ పైపుకు తగిలి విద్యు ద్ఘాతానికి గురయ్యారు. ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణం కోల్పోయారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, రూ.20 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషి యా ఇవ్వాలని గ్రామస్తులు కోరారు. ఘటనా స్థలికి వచ్చిన డోర్నకల్ సీఐ శ్రీనివాస్ వివరాలు సేకరించారు. మృతదేహాలను మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.