Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీజేఎమ్యూ ఆవిర్భావ వేడుకల్లో హన్మంతు ముదిరాజ్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
టీఎస్ఆర్టీసీలో కార్మిక సంఘాల కార్యకలాపాలను అనుమతించాలని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజేఎమ్యూ) వ్యవస్థాపక, ప్రధాన కార్యదర్శి కే హన్మంతు ముదిరాజ్ అన్నారు. ఆ సంఘం 5వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారంనాడిక్కడి టీజేఎమ్యూ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్, జోతిరావు పూలే చిత్రపటాలకు పూలమాలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం హన్మంతు ముదిరాజ్ మాట్లాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోయిందన్నారు. ఆర్టీసీలో చట్టవ్యతిరేక పాలన సాగుతున్నదనీ, కార్మికులపై పనిభారాలు మోపుతూ, మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు పెంచకుండా నిర్లక్ష్యం చేయడం క్షమించరాని నేరమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గోలి రవీందర్, స్వాములయ్య, ఆర్ఎన్ రావు , నరేందర్ , సిటీ జోనల్ నాయకులు జంగారెడ్డి, సత్యనారాయణ, హైదరాబాద్ సిటీ రీజినల్ కార్యదర్శి బులెట్ పాండు తదితరులు పాల్గొన్నారు.