Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి డైరెక్టర్ బలరాం
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
కంపెనీ వ్యాప్తంగా గనులు, విభాగాల్లో యోగాను నిరంతరాయంగా ఆచరించడం కోసం యాజమాన్యం సహకారం అందిస్తుందనీ, దానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని సింగరేణి కాలరీస్ డైరెక్టర్ (పర్సనల్, ఫైనాన్స్, పీ అండ్ పీి) ఎన్ బలరామ్ తెలిపారు. 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ సింగరేణి భవన్లో మంగళవారం నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.ఇప్పటికే సంస్థలోని ప్రతి ఏరియాలో యోగా కేంద్రాలను ఏర్పాటు చేసి యోగా శిక్షకులతో నిత్యం శిక్షణ ఇప్పిస్తున్నామనీ, దీన్ని మరింత విస్త్రుత పరుస్తామని చెప్పారు. దీనివల్ల ఉద్యోగులు, కార్మికుల్లో మానసికంగా, శారీరకంగా లబ్ది చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో జనరల్ మేనేజర్లు కే సూర్యనారాయణ, ఎమ్ సురేష్, ఎన్.వి.రాజశేఖరరావు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఎన్.భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగరేణి భవన్లో ఉద్యోగులకు 75 రోజులుగా యోగా శిక్షణ ఇస్తున్న శిక్షకురాలు శ్రీమతి రాధికను సన్మానించారు. నిత్యం యోగ సాధన చేస్తున్న ఉద్యోగులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.