Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తల్లి, ఇద్దరు పిల్లలు
- నల్లగొండ పట్టణవాసులు
నవతెలంగాణ -నల్లగొండ
రైలు ఢకొీని ఇద్దరు పిల్లలు సహా తల్లి దుర్మరణం చెందారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా సత్తెనపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి జరిగింది. నల్లగొండ పట్టణంలోని చైతన్యపురి కాలనీకి చెందిన రమ్య ఇద్దరు పిల్లలతో నడికుడ జంక్షన్ వద్ద రైలు పట్టాలను దాటుతుండగా ఫలక్నామా రైలు ఢకొీట్టింది. దీంతో రమ్య (28), పిల్లలు రిషిక్ రెడ్డి(8), హంసిక(6) అక్కడికక్కడే మృతిచెందారు. రైల్వే పోలీసులు మృతదేహాలను సత్తెనపల్లి ఆస్పత్రి మార్చురీకి తరలించారు. నడికూడ రైల్వే పోలీసులు నల్ల గొండలోని రమ్య భర్త, కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో మంగళవారం తెల్లవారుజామున వారు సత్తెనపల్లికి తరలివెళ్లారు. ఈ సంఘ టన ప్రమాదమా ? ఆత్మహత్య అనే విషయం తెలియాల్సి ఉంది. వీరి సొంత గ్రామం నార్కట్‌పల్లి మండలం ఔరవాణి. ఐదేండ్లుగా నల్లగొండ జిల్లా కేంద్రం లోని చైతన్యపూరి కాలనీలో నివాసముంటున్నారు. మృతురాలు కుండలపై పె యింట్ వేసేదని, భర్త జాన్‌రెడ్డి జేసీబీ నడుపుతున్నారని, పిల్లలిద్దరు పట్ట ణంలోని ప్రేరణ స్కూల్లో చదువుతున్నారని స్థానికులు తెలిపారు.