Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వానాకాలం సీజన్ ప్రారంభమైందనీ, అయినా రాష్ట్ర ప్రభుత్వం పంట పెట్టుబడి ఇవ్వలేదని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. రైతు బంధు కోసం బుధవారం అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేయాలని ఈమేరకు మంగళవారం ఆయన పిలుపునిచ్చారు. అదే విధంగా రైతుల సమస్యలపై కలెక్టర్లకు వినతిపత్రం సమర్పించాలని కోరారు. ఏఐసీసీ పిలుపుమేరకు ఈ కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు.
రాహుల్ ఈడీ విచారణకు నిరసనగా ప్రధాని, హోంమంత్రి దిష్టిబొమ్మ దహనం
ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీని కక్షపూరితంగా ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ...టీపీసీసీ ఫిషర్మెన్ విభాగం రాష్ట్ర చైర్మెన్ మెట్టుసాయికుమార్ ఆధ్వర్యంలో ప్రధాని, హోంమంత్రి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో నిజాయితీకి రాహుల్‌గాంధీ నిలువుటద్దమన్నారు. గాంధీ కుటుంబంపై బీజేపీ ప్రభుత్వం బురదజల్లే ప్రయత్నం చేస్తున్నదన్నారు. అగ్నిపథ్ పేరుతో బీజేపీ ప్రభుత్వం దేశ భద్రతను తాకట్టు పెడుతున్నదని విమర్శించారు. ఆర్మీలో కాంట్రాక్టు పద్దతిలో రిక్రూట్మెంట్ చేయడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే అగ్నిపథ్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఐఐఐటీ విద్యార్థుల పోరు అభినందనీయం : మధుయాష్కీగౌడ్
బాసర ట్రిబుల్ ఐటీ విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం చేసిన పోరాటాన్ని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కీగౌడ్ అభినందించారు. అధికారుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా చేసిన అలుపెరగని పోరులో అంతిమ విజయం సాధించిన విద్యార్ధులకు ప్రత్యేక శుభాభివందనాలు అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఫామ్‌హౌజ్ సీఎం ఏం చేస్తున్నారు?:పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ట్వీట్
హైదరాబాద్ సహా రాష్ట్రం నలుమూలలా ప్రతిరోజూ ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు. ఇంతటి దారుణాలు జరుగుతున్నా...ఫామ్హాజ్ సీఎం, డమ్మీ హోంమంత్రి కనీసం సమీక్ష కూడా చేయకపోవడం ఈ రాష్ట్ర దౌర్బాగ్యమని పేర్నొన్నారు. టీఆర్ఎస్ పార్టీ, మరో తొత్తు పార్టీ నేతల కుమారుల ఆగడాలకు ఆడపిల్లలు బలి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
జయశంకర్‌కు ఘనంగా నివాళి
ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా మంగళవారం టీఆర్ఎల్పీలో ఎమ్మెల్యేలు ఘనంగా నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు చేసి నివాళలర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్‌విప్ వినరుభాస్కర్, అసెంబ్లీ కార్యదర్శి ఎం రమేష్‌రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జయశంకర్ కలలను నిజం చేసే దిశగా సీఎం కేసీఆర్ పాలన ఉందని అభిప్రాయపడ్డారు.