Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆచార్య జయశంకర్ ఆశయ స్ఫూర్తితోజనరంజ కంగా పాలన కొనసాగుతున్నదని రాష్ట్ర రోడ్లు భవననాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. జయశంకర్ 11వ వర్థంతి సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో ఆయన చిత్ర పటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కొందరు పార్ట్ టైంగా పనిచేస్తే, మరికొందరు పూర్తి సమయం ఉద్యమానికే అంకితమై పనిచేశారని చెప్పారు. తన జీవితకాలం రాష్ట్ర సాధనకోసమే పని చేశారని గుర్తు చేశారు. నివాళలర్పించిన వారిలో నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి,ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు, నిజమాబాద్ డీసీసీబీ వైస్ చైర్మెన్ రమేష్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు జక్క రాజేశ్వర్ ఉన్నారు.