Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాగ్రత్తలు తీసుకోవాలి: రాష్ట్ర వైద్యారోగ్యశాఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కోరింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు ఒక ప్రకటన విడుదల చేశారు. కోవిడ్ కేసుల పెరుగుదలను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రజలు వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవడంతో పాటు ఫేస్ మాస్కులు ధరించటం, భౌతిక దూరాన్ని పాటించడం కూడా ముఖ్యమని తెలిపారు. పదేండ్లలోపు చిన్నారులు, 60 ఏండ్ల పైబడ్డ వారు తప్పనిసరైతే తప్ప బయటికి వెళ్లవద్దని, కోవిడ్ బారిన పడేందుకు ఎక్కువగా అవకాశమున్న 20 ఏండ్ల నుంచి 50 ఏండ్లలోపు వారు పనికోసం బయటికి వెళ్లినప్పుడు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. బయటికి వెళ్లే ప్రతి ఒక్కరు ఫేస్ మాస్కులు ఉపయోగించాలనీ, ఆరడుగుల భౌతిక దూరాన్ని పాటించాలని కోరారు.