Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రవ్యాప్తంగా తరలిరండి
- 6న సీసీఎస్ పరిరక్షణదినం
- డిమాండ్ బ్యాడ్జీలతో నిరసనలు :
- టీఎస్ఆర్టీసీ జేఏసీ భవిష్యత్ కార్యాచరణ వెల్లడి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీలో కార్మిక సంఘ కార్యకలాపాలను అనుమతించాలని డిమాండ్ చేస్తూ జులై 12వ తేదీ చలో లేబర్ కమిషనర్ ఆఫీస్ ఆందోళన నిర్వహిస్తున్నట్టు టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ తెలిపింది. దీనికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల నుంచి ఆర్టీసీ కార్మికులు పెద్దసంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అలాగే జులై 6వ తేదీ సీసీఎస్ పరిరక్షణ దినం పాటిస్తూ, కార్మికులంతా డిమాండ్ బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావాలని చెప్పారు. జేఏసీ సమావేశం చైర్మెన్ కే రాజిరెడ్డి అధ్యక్షతన మంగళవారంనాడిక్కడి ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీసులో జరిగింది. కన్వీనర్ వీఎస్ రావు, జేఏసీ నాయకులు స్వాములయ్య, రవీందర్, బుద్ధ విశాల్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు హాజర య్యారు. సీసీఎస్ రక్షణ, షేర్ హౌల్డర్ల హక్కుల సంరక్షణకు కమీషనర్ ఆఫ్ సోసైటీస్కీ, యాజమాన్యానికి పలు మార్లు విజ్ఞాపన పత్రాలు ఇచ్చామని వారు తెలిపారు. అలాగే ఆర్టీసీలో చట్ట ప్రకారం కార్మిక సంఘాల కార్యక్రమాలకు అనుమతించడంలేదనీ, దాన్ని పరిష్కరించాలని కోరుతూ కూడా లేబర్ కమీషనర్‌కు చాలాసార్లు వినతిపత్రాలు ఇచ్చామని వివిరించారు. ఈ సమస్యల పరిష్కారంకోసం కమీషనర్ ఆఫ్ సోసైటీస్ కానీ, లేబర్ కమీషనర్ కానీ ఎలాంటి ప్రయత్నం చేయలేదని స్పష్టం చేశారు. అందువల్లే జేఏసీ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించామన్నారు. 12న జరిగే చలో లేబర్ కమిషనర్ ఆఫీస్ ఆందోళనలకు అన్ని డిపోల నుంచి కార్మికులు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు.