Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేయర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అంబర్‌పేట మాజీ కార్పొరేటర్..
హైదరాబాద్ : బాగ్ అంబర్ పేట డివిజన్లో సమస్యలు పరిష్కరించాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ ని విన్నవించారు. మంగళవారం మేయర్ కార్యాలయానికి బాగ్ అంబర్ పేట డివిజన్ మాజీ కార్పొరేటర్ పద్మావతి డి.పి.రెడ్డి వెళ్లి, మేయర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.మేయర్ జి. విజయలక్ష్మీ జన్మదినం సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేశారు.మేయర్ హయాంలో మరిన్ని అభివృద్ధిపనులు జరగాలని ఆకాంక్షించారు. అలాగే తమ డివిజన్ అభివృద్ధి గురించి మేయర్ ..పద్మావతిని అడిగి తెలుసుకున్నారు.