Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడవి పందుల నియంత్రణకు కేరళ తరహా జీఓ: వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
నవతెలంగాణ-జహీరాబాద్
వ్యవసాయ రంగంలో త్వరలోనే పెనుమార్పులు రానున్నాయని, యాంత్రీకరణ విధానం పెరగనుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని రైతు వేదికలో సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జహీరాబాద్ ప్రాంతం వాణిజ్య పంటలకు అనువైన ప్రాంతమని.. ఇక్కడ ఉత్పత్తి అవుతున్న అల్లం, ఆలుగడ్డలకు సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు. మంత్రి హరీశ్‌రావుతో మాట్లాడి.. చెరుకు పరిశ్రమ యాజమాన్యంతో చర్చలు జరిపి చెరుకు రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలో కోటి 32 లక్షల ఎకరాల సాగు భూమి ఉన్నదని.. ఇందులో 11 లక్షల ఎకరాల్లో ఉద్యానవన పంటలు సాగు చేస్తున్నారన్నారు. కేరళ ప్రభుత్వం మాదిరిగా రాష్ట్రంలో కూడా అడవి పందులను నివారించేం దుకు జీవోను తీసుకొస్తున్నామని, త్వరలోనే అమలు చేస్తామని చెప్పారు. దళితబంధులో వ్యవసాయ పనిముట్లను ఇప్పించి.. ఆ మండలంలో కావాల్సిన రైతులకు వాటిని అద్దెకు ఇవ్వడంతో నూతన ఒరవడిని సృష్టిం చాలని.. ఈ విధానంపై డిప్యూటీ కలెక్టర్ వీరారెడ్డి దృష్టి సారించి ప్రణాళికా బద్ధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఉపాధి లేక ఇబ్బందిపడు తున్న వారినందరినీ అనుసంధానం చేసి ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్లేలా ప్రణాళికలు తయారు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే మాణిక్యరావు, డీసీఎంఎస్ చైర్మెన్ మల్కాపురం శివకుమార్, వ్యవసాయ శాఖ జెడి నర్సింగరావు, ఏడీ, ఏఈఓలు, సీడీసీ చైర్మన్ ఉమా కాంత్ పాటిల్, ఆత్మ కమిటి చైర్మెన్ విజయకుమార్, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు తాజుద్దీన్, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.