Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మా భూములు లాక్కుంటే ఊరుకోం
- పెద్దఎత్తున రైతుల రాస్తారోకో
నవతెలంగాణ- మిర్యాలగూడ
నల్లగొండ జిల్లా మిర్యాలగూడం మండలం ఆలగడపలో ఏర్పాటు చేయనున్న ఆహారశుద్ధి మండలి (ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్)ను రద్దు చేయాలని, దాని పేరిట మా భూము లు లాక్కుంటే ఊరుకోమని రైతులు ఆందోళనకు దిగారు. ఆలగడపలో భూములు కోల్పోతున్న రైతులు మంగళవారం ఆకుపచ్చని జెండాలు పట్టుకుని కోదాడ జడ్చర్ల జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. సుమారు రెండు గంటలపాటు బైటా యించారు. ఆహారశుద్ధి మండలిలో అలగడప, అవంతిపురం, రాయిని పాలెం, జాలు బారుతండా రైతులు భూములు కోల్పోతున్నారు. న్యాయం కావాలంటూ రైతులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. రైతుల అను మతి లేకుండా, ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఆహారశుద్ధి మండలి పెట్టడం సరికాదన్నారు. ఆహారశుద్ధి మండలి ఏర్పాటుకు భూములు ఇవ్వ బోమని తేల్చి చెప్పారు. ఈ విషయం పై గతంలో రెవెన్యూ అధికారులకు, కలెక్టర్‌కు, ఎమ్మెల్యేకు, మంత్రికి వివరించామని గుర్తుచేశారు. ఇప్పుడు భూసేకరణ పూర్తయిందని ప్రకటన చేయడం ఆందోళన కలిగిస్తోందన్నా రు. ఎట్టి పరిస్థితిలోనూ భూములు ఇవ్వబోమని చెప్పారు. అందరం చిన్న సన్నకారు రైతులమని, ఆ భూములను నమ్ముకుని బతుకుతున్నామని, భూ ములు లేకుంటే ఆత్మహత్యలే శరణ్యమ ని వాపోయారు. కొనుగోళ్లు.. అమ్మ కాలు జరపకుండా మా భూముల సర్వే నెంబర్లను ఫ్రిజ్ చేశారని, వెంటనే ఫ్రీజ్ను తొలగించాలని డిమాండ్ చేశారు. ఆర్డీఓ వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని చెప్పారు. దీంతో రూరల్ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో తహసీల్దార్ అనిల్‌కుమార్ రైతులతో చర్చించారు. భూములు తీసుకుంటున్నట్టు ఉన్నత అధికారుల నుంచి తమకు ఎలాంటి ఆదేశాలూ రాలేదని చెప్పారు. రాతపూర్వకంగా దరఖాస్తు చేస్తే ఫ్రీజ్ తొలగించేందుకు ఉన్నతాధికారులకు నివేదిక పంపుతా మని తెలిపారు. తహసీల్దార్ హామీతో రైతులు ఆందోళన విరమించారు.